- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెట్ షెడ్యూల్ మార్పుపై విద్యాశాఖ తర్జనభర్జన... అయోమయంలో అభ్యర్థులు
దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్), పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రెండూ ఒకేసారి రావడంతో టెట్ పరీక్షల నిర్వహణలో మార్పులు, చేర్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విద్యా శాఖ అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని అధికారులు గతంలోనే షెడ్యూల్ రిలీజ్ చేశారు. కానీ, వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వడంతో సమస్య మొదలైంది. మే 27న పోలింగ్ జరగనుంది. కాగా, ఈ ఎన్నికలకు సిబ్బంది ముందురోజే విధులకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ రెండు రోజులు మాత్రమే సెలవు ఇస్తే సరిపోతుందా.. లేక పూర్తిగా షెడ్యూల్‌నే మార్చాలా! అనే సందిగ్ధంలో విద్యా శాఖ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు విద్యాశాఖ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభ్యర్థులు సైతం అయోమయంలో ఉన్నారు.