- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ కేంద్రాలలో నో కోవాక్జిన్ స్టాక్.. రెండవ విడత కోసం ఎదురు చూపులు
దిశ, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం మొదటి విడతగా కోవాక్జిన్ టీకా తీసుకున్న వారు రెండవ విడత అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ ను నియంత్రించేందుకు కోవాక్జిన్, కోవీ షీల్డ్ రెండు దేశీయంగా తయారైన టీకాలను ప్రజలకు ముందు జాగ్రత్త చర్యగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి మొదటి విడతగా రెండు రకాల వ్యాక్సిన్ లు సరఫరా కాగా వీటిల్లో కోవాక్జిన్ టీకా మంచిదని, మెరుగైన ఫలితాలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో చాలా మంది కోవాక్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండవ విడత కోవాక్జిన్ వ్యాక్సిన్ కు నాలుగు వారాలు, కోవీషీల్డ్ కు నాలుగు నుండి ఎనిమిది వారాల గడువు లోగా వేయించుకోవాల్సి ఉంది. అయితే హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాలా వ్యాక్సిన్ సెంటర్ లలో కోవాక్జిన్ అందుబాటులో లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. దీంతో వారికి వ్యాక్సిన్ వేసిన కేంద్రాలలోనే కాకుండా ఇతర వ్యాక్సిన్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందుబాటులో లేదని తెలుసుకుని మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
రెండు విడతలుగా తీసుకున్న వారికి కూడా..
గ్రేటర్ పరిధిలో చాలా మందికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు విడతలు గా తీసుకున్నప్పటికీ కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో కేవలం ఒక్కసారి వ్యాక్సిన్ వేయించుకుని రెండవ విడత కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి చెప్పలేని విధంగా మారింది. ఇదిలా ఉండగా మొదటి విడతగా కోవీషీల్డ్ తీసుకున్న వారు రెండవ విడత కూడా అదే వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో మేము కోవాక్జిన్ ఎందుకు తీసుకున్నామా ? కోవిషీల్డ్ అయితే బాగుండేదని వారు మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొదటి విడతగా కోవాక్జిన్ వేయించుకున్న వారికి రెండవ విడత వ్యాక్సిన్ వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోవిన్ యాప్ లో నమోదు..
మొదటి విడత ఏదైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో రెండవ విడత కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం దేశమంతటా కోవాక్జిన్, కోవీ షీల్డ్ ఈ రెండు వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్న లబ్ధిదారుల వివరాలతో పాటు వారు తీసుకున్న వ్యాక్సిన్ ఏమిటనేది కోవిన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. రెండింటి పని తీరు సుమారు ఒకే విధంగా ఉన్నప్పటికీ టీకా అందుబాటులోకి వచ్చిన మొదట్లో ప్రజలలో సందేహాలు మొదలయ్యాయి. కోవాక్జిన్ పని తీరు
బాగుంటుందని జోరుగా ప్రచారం జరగడంతో మొదటి విడతగా దానిని వేయించుకున్న వారు రెండవ విడత కోసం ఇబ్బందులు పడుతున్నారు.
మొదటిడోసు ఒక టీకా, రెండో డోసు మరో టీకా తీసుకోవచ్చా?
కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను వేర్వేరు పద్ధతుల్లో అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ప్లాట్‌ఫాంలపై ఆధారపడి ఉన్నాయి. కోవాగ్జిన్ ఒక ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్. కొవిషీల్డ్ వైరల్ వెక్టార్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంది. అందువల్ల రెండు టీకాలను కలిపి తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.