రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటీవ్ లేదు..

by sudharani |
రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటీవ్ లేదు..
X

దిశ, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఒక్క కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు లేవని వైద్య అరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాజిటీవ్ ఉన్న వ్యక్తి కూడా నయమైందని, అతన్ని ప్రోటోకాల్ ప్రకారం 14 రోజులు హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాల్లలో కరోనా వైరస్ ఉండటంతో వివిధ దేశాల్లో ఉన్నవారు మన రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని వివరించారు. అన్ని ఏయిర్ పోర్టుల్లో 24 గంటలు స్ర్కీనింగ్ చేసేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతానికి 4 థర్మో స్ర్కీన్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయని మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కేసు లేకున్నా ఆప్రమత్తంగా ఉండాలని వివరించారు. గత 15 రోజుల్లో విమానాశ్రయంలో 41,102 మందికి స్ర్కీనింగ్ చేసి 277 మంది అనుమానితుల్ని గాంధీ తరలించి పరీక్షలు జరిపినట్టు తెలిపారు. వీరందరికీ కరోనా వైరస్ లేదని నిర్ధారించినట్టు వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ వరకు కరోనా వైరస్ పై సబ్బందికి అవగాహన కల్పించామని, అప్రమత్తంగా ఉన్నమని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed