- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో కరోనాను తరిమి కొట్టిన తొలి జిల్లా ఇదే…!
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అత్యధిక కేసులు వచ్చిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా అన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశం జిల్లాలో అదిగో కరోనా అంటే ఇదిగో కరోనా అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అలా కేసులు పెరుగుతూ పెరుగుతూ 63కి చేరుకున్నాయి.
ఈ లోపు కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలు కరోనా వైరస్ వ్యాప్తిలో ముందజవేశాయి. అయితే, కరోనా వైరస్ నిరోధానికి జిల్లా యంత్రాంగం దృఢ సంకల్పంతో పనిచేసింది. దీంతో ఏపీలో కరోనా మహమ్మారిని విజయవంతంగా నియంత్రించిన తొలి జిల్లాగా నిలిచింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 63 పాజిటివ్ కేసులు రాగా, మే 16 నాటికి అందరూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ఇప్పుడు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోవడం విశేషం.
వైద్య, పోలీస్, వలంటీర్ వ్యవస్థ ఎంతో సమన్వయంతో పనిచేసిన ఫలితమే జిల్లాలో జీరో పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి తమ సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అన్నారు. కరోనా కంట్రోల్‌లోకి వచ్చినప్పటికీ మరికొన్నాళ్లపాటు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.