న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్ రహానే‌పై వేటు..?

by Anukaran |   ( Updated:2021-11-30 11:12:38.0  )
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్ రహానే‌పై వేటు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. నేడు మొదటి టెస్టు మ్యాచ్ చివరి రోజు. ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌గా అజింక్యా రహానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రెండో టెస్టుకు తుది జట్టులో రహానె చోటు ప్రశ్నార్థకంగా మారింది. రెండో టెస్టుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి వస్తాడు. దీంతో రహానేకు ప్లేస్ ఉంటుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఫామ్​ కోల్పోయిన రహానే ఘోరంగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న టెస్టులో కూడా కెప్టెన్ రహానే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 35 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 4 పరుగులు చేసి జట్టును ఆదుకోలేకపోయాడు. చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ సాధించిన రహానే.. మళ్లీ తన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. గత 24 ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్కసారీ సెంచరీ చేయలేదు. రెండు అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా రహానే విఫలమై నిరాశ పరిచాడు.

ఇక తాజాగా శ్రేయస్‌ అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో సత్తా చాటిన నేపథ్యంలో రెండో టెస్టుకు అతను కొనసాగడం ఖాయం. కాబట్టి రహానె లేదా పుజారాల్లో ఒకరిపై వేటు వేయక తప్పదు. అయితే టీమిండియాలకు ది వాల్‌గా పుజారాకు పేరుంది. కనుక రహానేపైనే వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో టీం మేనేజ్‌మెంట్ ఎవరిపై వేటు వేస్తుందో అనేది వేచి చూడాల్సిందే.

బిగ్‌న్యూస్.. IPLలో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు BAN..?

Advertisement

Next Story

Most Viewed