- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమ కట్టడాలపై చర్యలేవి..?
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగపల్లి, చందానగర్ జంట సర్కిళ్ల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అయినా అధికారులకు ఇవేమీ పట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలోని విద్యానగర్ ప్లాట్ నెంబర్ 32లో గతంలో నూతన నిర్మాణం చేపట్టారు. దీనికి జీహెచ్ఎంసీ వారు జీ ప్లస్ 2 పర్మిషన్ ఇవ్వగా నిర్మాణదారు మాత్రం మరో అంతస్థు అదనంగా వేశారు. అంతేకాకుండా రెసిడెన్షియల్ అనుమతి ఉన్న ఈ భవనాన్ని కమర్షియల్‌గా మార్చి షటర్లు వేశారు.
అదీగాక 150 ఫీట్ల రోడ్ నుంచి సెట్ బ్యాక్ తప్పిస్తూ కాలనీ ఇంటర్నల్ రోడ్‌ను చూపిస్తూ పర్మిషన్ పొందినట్లు సమాచారం. దీనిపై గతంలోనూ జీహెచ్ఎంసీ సిబ్బందికి పలువురు ఫిర్యాదు చేయగా ఓసారి ఈ బిల్డింగ్‌ను కూల్చివేశారు. కానీ సదరు నిర్మాణదారుడు తిరిగి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అది చివరి దశకు చేరుకుంది. ఇలా ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే కాదు శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్ల పరిధిలో చాలా వరకు అనుమతులు లేని నిర్మాణాలు కోకొల్లలుగా సాగుతున్నాయి. వీటిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.