- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్కజ్ మళ్లీ తెరుచుకుంది!
న్యూఢిల్లీ: షాబ్ ఎ బారత్ ప్రార్థనల కోసం సుమారు ఒక సంవత్సరకాలం తర్వాత ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ బిల్డింగ్ తెరుచుకుంది. గరిష్టంగా 50 మంది విజిటర్స్‌కే అనుమతి కండీషన్‌తో ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆరంతస్తుల ఈ బిల్డింగ్ ముందు ఓ పోలీసు అధికారి లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరి పేర్లను నోట్ చేసుకుంటున్నారు. గతేడాది మార్చిలో నిర్వహించిన తబ్లిగీ జమాత్‌లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని కేసు నమోదైన తర్వాత ఈ బిల్డింగ్‌ను మూసేశారు. ఈ పరిసర ప్రాంతాన్నీ కొవిడ్ హాట్‌స్పాట్‌గా పేర్కొన్నారు.
అయితే, షాబ్ ఎ బారాత్ పండుగ సందర్భంగా వక్ఫ్ బోర్డు ఎంచుకున్న 50 మంది విజిటర్స్‌ను మర్కజ్‌లోకి అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశమిచ్చింది. దీంతో ఆదివారం ఈ మర్కజ్ మళ్లీ తెరుచుకుంది. మర్కజ్ తెరుచుకోవడం సంతోషంగా ఉన్నదని, ఇంకా చాలా మందిని ఇందులోకి అనుమతించాలని ఓ తబ్లిగీ జమాత్ సభ్యుడు అన్నారు. కరోనా నిబంధనలు సంతోషంగా పాటిస్తున్నామని, ఇవే నిబంధనలు ఎన్నికల్లోనూ పాటించాలని, లేదంటే కరోనా వేగంగా వ్యాపించే ముప్పు ఉన్నదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా విధించిన లాక్‌డౌన్‌లతో ఎక్కడివారక్కడే చిక్కుకుపోయినట్టే గతేడాదీ ఇక్కడ చిక్కుకుపోయారని, కానీ, వారిని మీడియా మానవ బాంబులుగా చిత్రించడం సరికాదని తెలిపారు. మర్కజ్ లోపలా కరోనా నిబంధనలను పటిష్టంగా అమలువుతున్నాయని వివరించారు.