- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేత
దిశ, న్యూస్ బ్యూరో: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేయడంతో ప్రవర్తనా నియమావళిని కూడా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 7వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. మూడవ లాక్‌డౌన్ సందర్భంగా మే 22న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసి ఎన్నికల ప్రక్రియను 45 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి మాత్రం యధావిధిగా అమలులో ఉంది. జూలై రెండవ వారం వరకూ ఎన్నికలు జరిగే అవకాశం లేనందున ప్రవర్తనా నియమావళిని సైతం తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం స్పష్టం చేసింది. దాదాపు రెండున్నర నెలలుగా ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కోడ్ ఎత్తివేతతో మళ్ళీ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. జూలైలో జరిగే ఎన్నికలకు అభివృద్ధి పనులను చూపి ఓటర్లను ఆకర్షించడానికి అధికార పార్టీకి వెసులుబాటు కల్పించినట్లయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కుమార్తె కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.