మందుల కొనుగోలు వివరాలివ్వాలి : కలెక్టర్ శరత్

by Shyam |
మందుల కొనుగోలు వివరాలివ్వాలి : కలెక్టర్ శరత్
X

దిశ, నిజామాబాద్: మెడికల్ షాపుల యజమానులు మందుల కొనుగోళ్లకు సంబంధించి ప్రతి రోజు సాయంత్రం వాట్సాప్ ద్వారా జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు వివరాలు పంపాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం, గొంతు నొప్పికి సంబంధించి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలు పంపాలన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత హాలులో శనివారం కామారెడ్డి మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మెడికల్ షాపుల ద్వారా ట్యాబ్లెట్లు కొనుగోలు చేసే వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది ద్వారా టాబ్లెట్లు తీసుకున్న వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉంటే ముందుగానే గుర్తించే వీలు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గజవాడ రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: Nizamabad,collector Sharath,Medical shop

Advertisement

Next Story