నిజామాబాద్‌ కరోనా టెస్టుల రిపోర్ట్.. చూస్తే షాక్

by Shyam |

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా పరీక్షల కోసం పంపించిన 32 శాంపిల్స్‌ నెగెటివ్ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకారం శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేనట్లు అని తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 608 శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించగా, ఇప్పటివరకు 498 మంది రిపోర్ట్స్ రాగా, మరో 52 రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా గురువారం వరకు 58 కేసుల్లో కరోనా పాజిటివ్ అని తేలగా, శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండి లాక్‌డౌన్ నిబంధనలను 100 శాతం పాటించాలని, అప్పుడే వైరస్ నియంత్రణలో ఉంటుందన్నారు. అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని, జరిమానా కూడా విధిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా, జైలుకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు.

tags ; corona, lock down, 32 reports got negative, collector narayana reddy

Advertisement

Next Story

Most Viewed