నివేదకు ఫ్యాన్ బాయ్ సర్‌ప్రైజ్

by Shyam |
నివేదకు ఫ్యాన్ బాయ్ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్‌కు ఓ డై హార్డ్ ఫ్యాన్ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నవంబర్ 30న తన పుట్టినరోజు కాగా, పాండిచ్చేరికి చెందిన ప్రభు.. నివేదకు లైఫ్‌లో మరిచిపోలేని థ్రిల్లింగ్ మూమెంట్ అందించాడు. తన చేతిపై ‘నివేదా పేతురాజ్’ పేరు అపి టాటూ వేయించుకుని తనంటే ఎంత అభిమానమో చెప్పకనే చెప్పాడు.

పాండిచ్చేరిలో ఓ తెలుగు ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంటున్న తనను కలిసిన ప్రభు.. ఈ స్వీట్ గెశ్చర్‌తో ఫ్యాన్ బాయ్‌గా తన లవ్ చూపించాడు. దీంతో చాలా సంతోషపడిపోయిన నివేదా తనతో కలిసి ఫొటోలు దిగింది. ఇంత గొప్ప అభిమానానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం నివేదా తెలుగులో ‘రెడ్’ సినిమా కంప్లీట్ చేయడంతో పాటు మరిన్ని సినిమాలు సైన్ చేసింది. అటు తమిళ్‌లోనూ బిజీ షెడ్యూల్‌తో ఉంది.

Advertisement

Next Story