‘నివర్​’ తుఫాన్​ పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిరంజన్​రెడ్డి

by Shyam |
‘నివర్​’ తుఫాన్​ పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిరంజన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నివర్​’ తుఫాన్​ దక్షిణ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు రెండు రోజులపాటు పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని, ఇప్పటికే ఉన్న ధాన్యం, పత్తి వీలయినంత త్వరగా కొనుగోలు చేయించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం, పత్తి తడవకుండా టార్పాలిన్లు,ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని కప్పి ఉంచాలని, పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగులు కొనుగోలు కేంద్రాలను వదిలి వెళ్లరాదని మంత్రి సూచించారు. జిల్లా, రీజినల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Advertisement

Next Story