హిరో నితిన్ వివాహం వాయిదా?

by Shyam |   ( Updated:2020-03-15 04:13:27.0  )
హిరో నితిన్ వివాహం వాయిదా?
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వివాహంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఇటీవలే తాను ప్రేమించిన షాలినితో నిశ్చితార్థం చేసుకున్న నితిన్, ఏప్రిల్ 16న దుబాయ్‌లో వివాహానికి వేదికను సిద్ధం చేసుకున్నారు.అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు,కేసులు పెరుగుతుండటంతో పలు దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మరికొన్నిదేశాలయితే ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నాయి. నితిన్ ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలు కాగా, వచ్చే నెల 15న ప్రీ వెడ్డింగ్, 16న రిసెప్షన్ ఈవెంట్స్‌ను కూడా ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో దుబాయ్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని నితిన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్‌లో కంటే ఇండియాలో వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో హైదరాబాద్‌లోనే వివాహం ప్లాన్ చేసుకోవాలని కొందరు బంధుమిత్రులు నితిన్‌కు సలహా ఇస్తున్నట్టు సమాచారం.కాగా, నితిన్, షాలినీల వివాహం వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Tags: Nitin Shalini Marriage, Postponed, Dubai, Coronavirus

Advertisement

Next Story