- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్
దిశ, వెబ్‌డెస్క్ :
‘నిశ్శబ్దం’ సినిమా.. టైటిల్ మాదిరిగానే కొన్ని రోజుల పాటు చిత్ర యూనిట్ కూడా నిశ్శబ్దాన్ని పాటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ అనేక రూమర్లు వెలువడ్డా.. చిత్ర యూనిట్ మాత్రం థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది. లేటెస్ట్‌గా ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఈ రోజు టాలీవుడ్ హంక్.. రానాతో సినిమా రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేయించింది. కాగా, తాజాగా రివీల్ చేసిన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
అనుష్క శెట్టి, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నిశ్శబ్దం’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదట విడుదల చేసిన ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందనే విషయం స్పష్టం కాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ముఖ్యంగా కిడ్నాప్, హత్య, మిస్టరీ, హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క డెఫ్ అండ్ డంబ్ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో అనుష్క.. ఓ పెయింటర్‌గా నటిస్తుండగా, మాధవన్ మ్యూజిషియన్‌గా కనిపిస్తున్నాడు. ఇక అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలిని పాండే నటించింది. కాగా సినిమాలో ఆమె పాత్ర కీలకం కానుంది. హఠాత్తుగా సోనాలి ఎందుకు కనపడకుండా పోయింది? ఇంతకీ తను బతికే ఉందా? అనుష్క, మాధవన్‌లు వెళ్లిన ఇంట్లో దెయ్యం ఉందా? అనే విషయాలను ఆసక్తికరంగా ఉండేలా ట్రైలర్‌ను కట్ చేశారు. సినిమాలో హాలీవుడ్ నటుడు ఆండ్రూ హడ్సన్, హీరోయిన్ అంజలి పోలీస్ అధికారులుగా నటించారు.
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వ ప్రసాద్, కోన వెంకట్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.