- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రవెల్లి పిలుస్తోంది.. దళిత దండోరాకు..
దిశ, ముధోల్ : ఇంద్రవెల్లి పిలుస్తోంది.. కార్యకర్తలు తరలి రావాలంటూ నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పిలుపునిచ్చారు. శనివారం బైంసా పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ.. ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభను విజయవంతం చేయాలని తాలూకా నాయకులకు, కార్యకర్తలను కోరారు. తెరాస పాలనలో దళితులకు, గిరిజనులకు, సమున్నత న్యాయం కల్పించలేదన్నారు.
బడుగు, బలహీన గిరిజనులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, అలాగే దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలనే డిమాండ్ మేరకు నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాలన్నారు. ముధోల్ నియోజకవర్గం నుండి 300 ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డిలు హాజరనై సోమవారం జరగబోయే దండోర కార్యక్రమాన్ని కార్యకర్తలు, సమీకరణాలను, వాహన సదుపాయాలను పరిశీలించారు.