నిర్మల్ జిల్లాలో 204 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

by Aamani |
నిర్మల్ జిల్లాలో 204 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో 204 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల, సహకార శాఖలు, డీసీఎంఎస్ అధికారులతో కలిసి జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏఈఓ, ఏవోలకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ 2.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ధాన్యం సేకరణకు 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు తగినన్ని మౌలిక సదుపాయాలు, టార్పాలిన్, తేమ కొలుచు యంత్రాలు, వేయింగ్ మిషన్ లు, ప్యాడి క్లీనర్‌లను సమకూర్చాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. తేదీల వారీగా టోకెన్లు ఇచ్చి వాటి ప్రకారం వ్యవసాయ అధికారులు, ఏఈఓలు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, పౌరసరఫరాల కార్పోరేషన్ మేనేజర్ శ్రీ కళ, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Nirmal,204 crop purchase center, Additional collector Bhaskar,meeting

Advertisement

Next Story

Most Viewed