ఉరితీత పిటిషన్‌పై నేడు తీర్పు..

by Shamantha N |
ఉరితీత పిటిషన్‌పై నేడు తీర్పు..
X

దిశ,వెబ్‌డెస్క్: నిర్భయ నిందితులను విడివిడిగా ఉరితీసేందుకు అనుమతివ్వాలని కోరుతూ కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది.గతంలో నిర్భయ నిందితుల పిటిషన్లపై విచారణ సమయంలో దోషులకు అమలు చేయాల్సిన శిక్ష ఇప్పటికే ఆలస్యమయ్యిందని, కావున వారికి విడివిడిగా ఉరితీసేలా అనుమతివ్వాలని కోరుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పబట్టింది.చట్టంలోని లొసుగులతో నిందితులు భారతీయ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని భావించిన కేంద్ర హోంశాఖ వారిని విడివిడిగా ఉరితీసేలా అనుమతివ్వాలని సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నేటికి వాయిదా వేసింది. కాగా జస్టిస్ భారతీ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం పిటిషన్‌పై సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed