సంతోషం.. రెండోదశ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించండి

by srinivas |   ( Updated:2021-02-10 01:51:35.0  )
సంతోషం.. రెండోదశ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించండి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ తో పాటు కౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ ముందజలో ఉండగా.. ప్రతిపక్షపార్టీ టీడీపీ గట్టిపోటీ ఇస్తుంది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్పందించారు. ఏపీలో తొలిదశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందన్నారు. ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం సంతోషదాయకమన్న నిమ్మగడ్డ.. కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో వ్యవహరించారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అదే విధంగా రెండో దశ ఎన్నికల్లోనూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓటర్లను కోరారు.

Advertisement

Next Story