- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిక్కీ గర్లాని కరోనా సజెషన్స్
హీరోయిన్ నిక్కీ గర్లాని.. ‘తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. దేవుడి దయవల్ల కోలుకున్నానని’ రెండు రోజుల క్రితం తెలిపింది. తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగులో బలుపు, మరకతమణి చిత్రాల్లో నటించింది. కాగా కరోనా నిర్ధారణ అయ్యాక తను ఎలాంటి అనుభవం పొందిందో తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది నిక్కీ.
కరోనా అంటే జనాల్లో అనవసర భయం ఉందని.. అందుకే దీని గురించి వివరించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపింది. గొంతు నొప్పి, జ్వరంతో బాధపడిన తాను వాసన, రుచి కోల్పోయానని తెలిపింది. టెస్ట్ చేయించగా కరోనా నిర్ధారణ కావడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పింది. తనకు ఇంతకు ముందు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు గనుక కరోనాను జయిస్తాననే నమ్మకంతో ఉన్నప్పటికీ.. అమ్మానాన్న, పెద్దలు, స్నేహితుల గురించి ఆలోచిస్తే భయం వేసిందన్నారు. తన వల్ల పెద్దలు, చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయితే క్రిటికల్ కండిషన్ ఉంటుందని, తనకుతానే దూరంగా ఉన్నట్లు చెప్పింది.
ప్రతీ ఒక్కరు కూడా తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించాలని, మాస్క్ ధరించాలని కోరింది. భౌతిక దూరం పాటించడంతో పాటు చేతులను తరచు శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకెళ్లకూడదని హెచ్చరించింది నిక్కీ. 24 గంటలు ఇంట్లో కూర్చునేందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందని తెలుసు కానీ.. ఇలాంటి విపత్కర సమయాల్లో సమాజం కోసం మనం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని చెప్పింది. కుటుంబంతో గడుపుతూ, ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉంటూ.. మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని చెప్పుకొచ్చింది నిక్కీ. డిప్రెషన్ ఫీల్ అయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలని సూచించింది.