చీటింగ్ కేసు.. పోలీసు స్టేషన్‌లో హీరోయిన్

by Shyam |
చీటింగ్ కేసు.. పోలీసు స్టేషన్‌లో హీరోయిన్
X

దిశ, సినిమా : హీరోయిన్ నిక్కీ గల్రానీ పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్‌మెన్‌పై చీటింగ్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది. కర్ణాటక రాష్ట్రం కోరమంగలలో నిఖిల్ హెగ్డే 2016లో కేఫ్ పెట్టాలని అనుకున్నాడని.. ఇందులో పార్ట్‌నర్‌గా తాను రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేశానని తెలిపింది. అగ్రిమెంట్ ప్రకారం నిఖిల్ ప్రతీ నెల ప్రాఫిట్‌‌గా రూ. లక్ష రూపాయలు చెల్లిస్తానని ప్రామిస్ చేశాడని తెలిపింది. కానీ ఇప్పటి వరకు తను ఇన్వెస్ట్ చేసిన డబ్బు కానీ, నెల నెల ఇస్తానన్న పేమెంట్ గానీ ఇవ్వలేదని పేర్కొంది. దీంతో నిఖిల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ట్రయల్ కోర్టులో హాజరు కావాలని నోటీసులు పంపించారు.

Advertisement

Next Story

Most Viewed