- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్న నిఖిల్
ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ యంగ్ హీరో నిఖిల్ వివాహం ఎట్టకేలకు గురువారం జరగనుంది. ఫిబ్రవరి 1న పల్లవివర్మతో నిశ్చితార్థం చేసుకున్న నిఖిల్‌కు ముందుగా ఏప్రిల్ 16న వివాహం నిశ్చయించారు. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఆ తర్వాత మే ఫస్ట్ వీక్‌లో అనుకున్నా.. మే 17 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అప్పటికే ముహూర్తాలు అన్నీ అయిపోతుండటం.. ఆ తర్వాత మళ్లీ ఏడాది వరకు ముహూర్తాలు లేకపోవడంతో గురువారం (మే 14న) ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. 20 మంది బంధుమిత్రుల నడుమ వివాహం జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో సన్నిహితులు మాత్రమే నిఖిల్ – పల్లవిల కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని సమాచారం. లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి తంతు పూర్తి కానుందట. హీరో నితిన్ కూడా కరోనా ప్రభావంతో తన పెళ్లి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.