నిహారిక – చైతు డెస్టినేషన్ వెడ్డింగ్

by Shyam |   ( Updated:2020-11-04 04:24:07.0  )
నిహారిక – చైతు డెస్టినేషన్ వెడ్డింగ్
X

దిశ, వెబ్‌డెస్క్:
మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి పీటలెక్కే టైమ్ వచ్చేసింది. జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు వేసే సుముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న రా. 7.15 నిమిషాలకు వివాహం జరగనుండగా.. ఈ విషయాన్ని ప్రకటించింది వరుడి కుటుంబం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చైతన్య ఫ్యామిలీ.. ముందుగా స్వామి వారికి వివాహమహోత్సవ ఆహ్వానపత్రిక సమర్పించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే నాగబాబు ప్రకటించగా.. పెళ్లి రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. దగ్గరి బంధువులు, ఆప్తమిత్రుల నడుమ పెళ్లి జరగనుండగా.. ఆగస్టులోనే నిహారిక – చైతు నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి డిసెంబర్‌లో ఉంటుందని భావించిన నిహారిక.. ఇప్పటికే ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలరేట్ పార్టీ కూడా చేసుకుంది. గోవాలో స్నేహితులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చి ఫుల్ ఎంజాయ్ చేసింది. కాగా ఎంగేజ్‌మెంట్ తర్వాత నిహారిక – చైతు తరచుగా కెమెరాలకు ఫోజులిస్తూనే ఉన్నారు.

Advertisement

Next Story