- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కార్మికులకు ఇస్మార్ట్ బ్యూటీ సాయం
వెండితెరపై హీరోయిన్‌గా తనను తాను చూసుకోవాలని కలలు కన్న ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.. అందుకోసం తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ ‘మున్నా మైఖేల్’తో హీరోయిన్‌గా పరిచయమైంది. నాగచైతన్య ‘సవ్యసాచి’ మూవీ ద్వారా తెలుగుతెరకు పరిచయమైన నిధి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్'తో ఇటీవలే బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తమిళ్‌లోనూ అవకాశాలొస్తున్న నేపథ్యంలో ఆ భాషపై పట్టు సాధించేందుకు కసరత్తులు చేస్తోంది. లాక్‌డౌన్ వేళ వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన ఈ బ్యూటీ.. తనవంతు సాయం అందించి మానవతను చాటుకుంది.
వలస కార్మికుల కోసం నిధి అగర్వాల్ ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేసి అందిస్తోంది. తాను ఆహారం ప్యాక్ చేస్తున్న ఓ ఫొటోను నిధి ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా.. తన దాతృత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది.
Migrant meals 💪🏼🙏🏼 pic.twitter.com/gExVoSC2Us
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) May 30, 2020