- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కళ్యాణ్ తో నటించడం నా అదృష్టం- Nidhhi Agerwal
దిశ, వెబ్‌డెస్క్: తన అందచందాలతో కురాళ్ల గుండెలను కొల్లగొట్టిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారింది. తెలుగు, తమిళ్ భాషల్లో తన సత్తా చాటుతున్న ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ లో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా గురుంచి బహిరంగంగా ఎప్పుడు మాట్లాడని ఈ హాట్ బ్యూటీ తాజాగా నోరు విప్పింది. ఈ అవకాశం రావడంపై తన మనసులో మాట బయటపెట్టింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటనను ఆకాశానికెత్తేసింది.
“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan )లాంటి గొప్ప నటుడితో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటివరకు నా కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఆఫర్.. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత అంతటి విజయాన్ని అందుకోలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి రావాలని హాట్ బ్యూటీ పలు ప్రయత్నాలు చేస్తోంది. మరి పవర్ స్టార్ క్రేజ్ తో ఈ భామ ఆ లిస్ట్ లోకి చేరుతుందేమో చూడాలి.