- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కెనడియన్ హీరోకు కరోనా… పరిస్థితి విషమం
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోతుంటే… మరెంతో మంది బాధపడుతున్నారు. ప్రముఖులు కూడా కరోనా నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ లో చేరారు. కొందరు ఈ వ్యాధి నుంచి కోలుకుంటే మరి కొందరు మృత్యువాత పడ్డారు.
ఈ క్రమంలో ప్రముఖ కెనడియన్ హీరో నిక్ కార్డెరో కు కరోనా పాజిటివ్ రావడంతో లాస్ ఏంజిల్స్ లోని హాస్పిటల్ లో చేరాడు. అయితే కరోనా ఇన్ఫెక్షన్ తో కుడి కాలు లోని రక్తనాళాలు గడ్డకట్టాయి. దీంతో కాలు తొలగించాల్సి వచ్చిందట. ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న నిక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు భార్య అమండా క్లూట్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం నిక్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు వెల్లడించింది.
Tags: Canadian Actor, Hollywood, Nick Cordero, Amanda kloots