గ్యాస్‌లీక్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

by  |
గ్యాస్‌లీక్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
X

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, విశాఖలోని ఓ కెమికల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకైన ఘటనలో చనిపోయిన, గాయపడ్డ వారికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ గురువారం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్టిరెన్ గ్యాస్ లీకైన కారణంగా ఎనిమిది మంది చనిపోవడంతో పాటు ఐదువేలకు పైగా అనారోగ్యానికి గురైనట్టు మీడియా నివేదికల ఆధారంగా దీనిని సుమోటోగా తీసుకున్నట్టు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెల్లడించింది. కాగా, రెస్క్యూ ఆపరేషన్‌కు చేపట్టిన చర్యలు, బాధితులకు అందిస్తోన్న చికిత్స, పరిహారానికి సంబంధించిన విషయాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ నోటీసులు జారీచేసింది. ప్రత్యేకించి పారిశ్రామిక విభాగ చట్టంలో పొందుపరిచిన నిబంధనలు అమలు చేయబడుతున్నాయో లేదో పరిశీలించి నివేదికను సమర్పించాల్సిందిగా వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. నాలుగువారాల్లోగా ఈ నివేదికలు అందజేయాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది.

Tags: Gas leak, Vizag, chemical plant, NHRC, Andhra pradesh, Central

Advertisement

Next Story

Most Viewed