తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ అసంతృప్తి

by Shyam |   ( Updated:2020-09-27 09:38:42.0  )
తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మూసీ ప్రక్షాళన కోసం నిర్ణయించిన అంచనా వ్యయం కూడా అధికంగా ఉన్నట్టు గుర్తిచినట్టు ఎన్జీటీ పేర్కొంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సమాచారంతో పోలిస్తే సాధారణం కంటే కూడా ఈ ధర 20 రెట్లు అధికంగా ఉందని ఎన్జీటీ అభిప్రాయపడింది. విశ్రాంత జస్టిస్ విలాస్ అప్జల్‌ పూర్కర్ నేతృత్వం వహించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, హైదరాబాద్‌ కలెక్టర్‌ను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ తన సహాకారానికి ఇతర నిపుణుడిని లేదా ఏదేని సంస్థను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. నెలరోజుల్లో మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని, నాలుగు నెలల్లో తొలి నివేదిక అందజేయాలని కమిటీకి ట్రిబ్యునల్ ఆదేశించింది.

Advertisement

Next Story