అప్పటికీ అదుపులోకి రాకుంటే రద్దే !

by Shyam |
అప్పటికీ అదుపులోకి రాకుంటే రద్దే !
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుండటంతో ఈ ఏడాది జులైలో నిర్వహించాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2020ని ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది కూడా కరోనా వైరస్ అదుపులోకి రాకుంటే ఆ మెగా ఈవెంట్ రద్దు చేస్తామని టోక్యో ఒలింపిక్స్ 2020 నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టం చేశారు. చలికాలంలో కరోనా వైరస్ మళ్లీ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అప్పుడు తీవ్రం రూపం దాల్చే వైరస్ వచ్చే ఏడాది జులై నాటికి తగ్గకుంటే ఒలింపిక్స్ పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని మోరీ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ కంటే ముందు అర్హత పోటీలు కూడా నిర్వహించాల్సి ఉంది. అవన్నీ సక్రమంగా జరిగితేనే వచ్చే ఏడాది క్రీడలు నిర్వహిస్తాం. లేకుంటే రద్దు చేయడమే మాకున్న ఏకైక మార్గం అని ఆయన వెల్లడించారు.

Tags : Olympics, Tokyo 2020, Yoshiro Mori, Coronavirus, Pandemic, Cancelled

Advertisement

Next Story

Most Viewed