రెండు నెలలకే విఫలమైన ప్రేమ వివాహం.. నవవధువు ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2021-10-13 12:06:42.0  )
రెండు నెలలకే విఫలమైన ప్రేమ వివాహం.. నవవధువు ఆత్మహత్య
X

దిశ, ఖమ్మం రూరల్​ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ, పట్టుమని రెండు నెలలు కూడా గడువక ముందే నవవధువు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం రూరల్​మండలంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. రూరల్ మండలం గుదిమళ్ల పంచాయతీ పరిధిలోని నంద్యా తండాకు చెందిన ధరవాత్​ శైలజ(20) ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించి అగస్టు నెలలో వివాహం చేసుకుంది.

పెళ్లయి రెండు నెలలు కూడా గడువక ముందే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే శైలజను రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శంకర్​రావు తెలిపారు.

Advertisement

Next Story