- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కలు నాటిన నవ దంపతులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నవదంపతులు మొక్కలు నాటారు. వారితో దగ్గరుండి మొక్కలు నాటించడమే కాకుండా సమాజానికి సరికొత్త సందేశాన్నిపెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అందించారు. సోమవారం మంథని RR గార్డెన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఆయన వధూవరులు ఎడ్ల సతీష్ కుమార్, జ్యోతిలచే మొక్కలు నాటించారు.
ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ పై, అన్నివర్గాల వారికి అవగాహనా కల్గిందన్నారు. ప్రముఖుల చేత మొక్కలు నాటించి , వారి భాగస్వామ్యంతో ప్రజల్లోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను తీసుకెళ్లడంలో సంతోష్ కుమార్ విజయం సాధించారన్నారు. హరిత తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సంతోష్ కుమార్‌ను పుట్టమధు అభినందిచారు. మంథని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ విధిగా మూడు మొక్కలు నాటి, మూడేళ్ల పాటు వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.