- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియా చెత్త ప్రదర్శన.. న్యూజీలాండ్ ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై న్యూజీలాండ్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేయగా.. 2 వికెట్లను కోల్పోయిన కివీస్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియా సెమీస్ బెర్తు ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. న్యూజీలాండ్‌లో మార్టిన్ గప్తిల్(20), మిచేల్ ‘(49) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వీరిద్దరి వికెట్లను బుమ్రా తీసుకున్నాడు. ఇక మిగతా ఇన్నింగ్స్‌ను కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) కాన్వాయ్ (2) నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించుకున్నారు.
భారత్ ఇన్నింగ్స్..
భారత్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌లు ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18) రోహిత్ శర్మ (18) దారుణంగా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్ పరిస్థితి కూడా ఇలాగే సాగింది. విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (12), హార్దిక్ పాండ్యా (23) నిలదొక్కుకోలేకపోయారు. రవీంద్ర జడేజా (26 ) నాటౌట్‌గా నిలవగా శార్దుల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు. మహ్మద్ షమీ క్రీజులోకి వచ్చినా బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. దీంతో 7 వికెట్ల నష్టానికి టీమిండియా 110 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఇక 111 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ అలవోకగా ఛేదించింది.