ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌కు ప్రధాని మద్దతు

by Shyam |
ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌కు ప్రధాని మద్దతు
X

దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మొట్ట మొదటి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా న్యూజీలాండ్‌కు చెందిన లారెల్ హబ్బార్డ్‌ రికార్డు సృష్టించనున్నది. మహిళల హెవీ వెయిట్ (87+ కిలోలు) కేటగిరీలో ఆమెకు ఒలింపిక్స్ దక్కింది. కాగా, దీనిపై పలు విమర్శలు చెలరేగాయి. లారెల్‌ను మహిళా కేటగిరీలో చేర్చడం వల్ల మరో మహిళా అథ్లెట్‌కు చోటు దక్కుండా పోయిందని పలువురు విమర్శలు గుప్పించారు. కాగా దీనిపై న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆడ్రెన్ మద్దతుగా నిలిచాడు. ‘ఇక్కడ నిబంధనలు అనుసరించే లారెల్ ఎంపిక జరిగింది. న్యూజీలాండ్ టీమ్ తరపున ఎన్నో టోర్నీల్లో పాల్గొన్నది.

అలాగే ఇప్పుడు తొలి సారిగా ఒలింపిక్స్‌కు వెళ్తున్నది. ప్రపంచమంతా నిర్ణయించిన నిబంధనలనే న్యూజీలాండ్‌ ప్యానెల్ కూడా అనుసరించి లారెల్‌ను ఎంపిక చేసింది’ అని జెసిండా అన్నారు. లారెల్ హబ్బార్డ్ (43) ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అత్యధిక వయస్కురాలైన లిఫ్టర్‌గా కూడా రికార్డులకు ఎక్కనున్నది. కాగా, 2013లో సర్జరీ చేయించుకోవడానికి ముందు హబ్బార్డ్ పురుషుల కేటగిరీలో పలు కాంపిటీషన్లలో పాల్గొన్నది.

Advertisement

Next Story

Most Viewed