న్యూజీలాండ్‌కు షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఫెర్గూసన్ ఔట్

by Shyam |
న్యూజీలాండ్‌కు షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఫెర్గూసన్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కీలకమైన టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. కివీస్ శిక్షణ సమయంలో కుడి కాలి పిక్కకు గాయం కావడంతో అతడికి వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అందులో కండరానికి పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. దీంతో లాకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్ కప్‌కు దూరమైనట్లు న్యూజీలాండ్ క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందే ఈ ప్రకటన వెలువడింది. లాకీ ఫెర్గూసన్ స్థానంలో అడమ్ మిల్నేను 15 మంది సభ్యుల బృందంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే అతడిని జట్టులోకి తీసుకోవడంపై ఐసీసీ అనుమతించాల్సి ఉందని సమాచారం. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన ఫెర్గూసన్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్ జట్టు ఫైనల్ చేరడంలో లాకీ ఫెర్గూసన్ కూడా కీలక పాత్ర పోషించాడు. కాగా, ఫెర్గూసన్‌కు శస్త్ర చికిత్స అవసరమా లేదా అనేది వైద్య నిపుణులు సూచించాల్సి ఉందని.. అయితే ప్రస్తుతానికి అతడు న్యూజీలాండ్ తిరిగి వెళ్లపోనున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది.

Advertisement

Next Story