- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు మ్యాచ్‌లు ఉండాల్సింది : యువరాజ్
దిశ, స్పోర్ట్స్ : వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెస్టాఫ్ త్రీగా నిర్వహిస్తే బాగుండేదని.. ఒకే మ్యాచ్ వల్ల టీమ్ ఇండియాకు కాస్త ప్రతికూలత ఉండే మాట నిజమే అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ‘టెస్ట్ క్రికెట్‌లో చాంపియన్‌షిప్ ఏర్పాటు మంచి ఆలోచన. టీమ్ ఇండియా ఈ ఫైనల్ గెలవాలని కోరుకుంటున్నాను. అయితే న్యూజీలాండ్‌కే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. టీమ్ ఇండియా ఇటీవల విదేశాల్లో అద్బుతంగా రాణిస్తున్నది. ఎక్కడైనా విజయం సాధించగలమనే ధీమా ఆటగాల్లలో ఉన్నది.
అయితే ఇంగ్లాండ్‌లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. అవి న్యూజీలాండ్ ఆటగాళ్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా డ్యూక్ బంతుల ప్రభావం మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ బలం సమానంగా ఉన్నది. అయితే ఫైనల్ కంటే ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడటం న్యూజీలాండ్‌కు కలసి వస్తుంది.’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న టీమ్ ఇండియా సోమవారం నుంచి నెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నది.