- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. కీలక సమాచారమిచ్చిన సునీల్
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్‌ను కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌ను ప్రశ్నించారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలపై సునీల్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌ను పులివెందుల తీసుకువెళ్లారు. ఆయుధాల కోసం వైఎస్ వివేకా ఇంటి సమీపంలోని లోతేటి వాగులో తనిఖీలు చేపట్టారు. వాగులోని మడుగుల్లో నిల్వ ఉన్న నీటిని రెండు మున్సిపల్ ట్యాంకర్లతో బయటకు తోడిస్తున్నారు. ఇకపోతే విచారణలో భాగంగా శనివారం పులివెందులలోని పాదరక్షల దుకాణం యజమాని మున్నాను, కడప స్టేషన్ మాస్టర్ మోహన్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. వీరితోపాటు వివేకా డ్రైవర్ దస్తగిరి, సుంకేశులకు చెందిన ఉమాశంకర్ రెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించారు.