- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్యాన్సర్ గాయత్రి సూసైడ్ కేసులో ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వాంబేకాలనీలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి కేసులో పురోగతి లభించింది. గాయత్రి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. నీలిమ భర్త బన్నీతో దిగిన ఫోటోను గాయత్రి వాట్సప్ స్టేటస్ పెట్టగా.. గమనించిన నీలిమ ఇవాళ ఉదయం గాయత్రి ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాతనే గాయత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలాకాలం నుంచి బన్నీ డ్యాన్స్ గ్రూపులో గాయత్రి పలు స్టేజీ షోలు చేసింది.
అయితే.. గాయత్రి ఆత్మహత్యకు నీలిమే కారణమని ప్రచారం జరగడంతో ఆమె బయటకు వచ్చి ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. ఇవాళ ఉదయం గాయత్రి ఇంటికి వెళ్లినది నిజమేనని, కానీ ఆమెతో ఎలాంటి గొడవ పెట్టుకోలేదని చెప్పింది. ఆరునెలల క్రితమే గాయత్రిని కలిసి నా భర్త బన్నీకి దూరంగా ఉండాలని చెప్పానని, అప్పుడు ఆమె అంగీకరించిందని తెలిపింది. లేకుంటే నాభర్తతో కలిసి ఉండు నేనే దూరంగా ఉంటానంటే గాయత్రి ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. బన్నీతో గాయత్రి వివాహేతర సంబంధం గురించి తెలిసి.. ఆమె భర్త సంతోష్ తీవ్రంగా కొట్టాడని, ఈ విషయాన్ని గాయత్రి కూడా తనతో చెప్పిందని, అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందో తనకు తెలీదని వివరించింది.