- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి భూకుంభకోణం కేసు.. మాజీమంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి భూకుంభకోణం కేసులో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను అధికారులు విచారించారు. రెవెన్యూ రికార్డుల మాయంపై అధికారులు ఆరా తీయగా అందుకు వివరణ ఇచ్చారు. 2015లో ల్యాండ్ ఫూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారని విచారణలో శ్రీధర్ తెలిపినట్లు తెలుస్తోంది. అనంతరం 2015 జనవరిలో ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41 తీసుకొచ్చారని తెలిపారు. ఇదంతా మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షించారని శ్రీధర్ స్పష్టం చేశారు.
ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్ధంగా ఉన్న అంశాలను మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లానని ..చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదని వెల్లడించారు. నాటి మంత్రి నారాయణ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందన్నారు. దీంతో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోది. శ్రీధర్ చెప్పిన వివరాల ఆధారంగా హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సీఐడీ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం తో రాజధాని భూములు వ్యవహారం కొత్త టర్న్ తీసుకొనే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే ఈ భూముల వ్యవహారం పైన సుప్రీం కోర్టు..హైకోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.