- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటర్నెట్‌లో కొత్త ట్రెండ్.. బినోద్!
బినోద్, బినోద్, బినోద్.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఇదే పేరు. అది ఒక హీరో పేరు కాదు, ఆ పేరుతో ఏ సంఘటన జరగలేదు, ఎలాంటి వైరల్ వీడియో రాలేదు. అయినప్పటికీ ఈ పేరు ఇప్పుడు చాలా పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎందుకు ఎలా ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు బినోద్ పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. గత వారం రోజులుగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో ట్రెండ్ అవుతున్న ఈ బినోద్ మీమ్స్ నేపథ్య కథ తెలిస్తే నవ్వుకుంటారు. చాలా మందికి ఈ బినోద్ ట్రెండ్ ఏంటో అర్థంకాక ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు. ఇంతకీ ఆ పేరు వెనక, ఆ మీమ్ ట్రెండ్ వెనక కథేంటో తెలుసుకుందాం!
ఎలా మొదలైంది?
యూట్యూబర్స్, సోషల్ మీడియా ట్రెండ్స్‌ను తమదైన శైలిలో వెటకారంగా చీల్చిచెండాడే ఒక హిందీ యూట్యూబ్ చానల్ ఉంది. దాని పేరు స్లే పాయింట్. దీని క్రియేటర్లు అభ్యుదయ్, గౌతమిలు జులై 15న ఒక వీడియో విడుదల చేశారు. దాని టైటిల్ పేరు ‘వై ఇండియన్ కామెంట్స్ సెక్షన్ ఈజ్ గార్బేజ్ (బినోద్)’. ఈ వీడియోలో తమ యూట్యూబ్ చానల్‌లోని వీడియోలకు వచ్చిన వింత వింత కామెంట్లకు వీళ్లు సెటైరికల్‌గా కామెంట్లు చేశారు. వారు అప్‌లోడ్ చేసిన కొన్ని వీడియోలకు బినోద్ థరూ అనే యూజర్ ‘బినోద్’ అని కామెంట్ చేశాడు. దానికి ఏడు లైకులు కూడా వచ్చాయి. అలాగే వీడియో కంటెంట్ ఏదైనా బినోద్ అని ఒకటే పదాన్ని కామెంట్ చేశాడు. ఇలా సంబంధం లేకుండా అన్నింటికి బినోద్ అని కామెంట్ చేయడాన్ని అభ్యుదయ్, గౌతమిలు మరింత వ్యంగ్యాన్ని జోడించి అన్ని ప్రశ్నలకు బినోద్ అని సమాధానం వాడుకోవచ్చని కామెంట్ చేశారు. అంతే.. ఇక హవా ప్రారంభమైంది.
ఇక ఆరోజు నుంచి చాలా మంది ఇండియన్ యూట్యూబర్ల వీడియోలకు బినోద్, బినోద్ అని అందరూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొందరైతే ఏకంగా కొన్ని వందల కామెంట్లు బినోద్ అంటూ చేశారు. అలా ఎవరీ బినోద్ అని యూట్యూబర్లు ఆలోచనలో పడ్డారు. ఇదే విషయం తెలిసిన మీమ్ క్రియేటర్లు తమ సృజనాత్మకత చూపించుకున్నారు. కంటెంట్ లేనప్పుడల్లా బినోద్, బినోద్ అని మీమ్స్ వేయడం మొదలు పెట్టారు. బినోద్ అనే ఈ పిచ్చి ట్రెండ్ బినోద్ థరూకి ఊహించని స్టార్‌డమ్ వచ్చిందని, సోషల్ మీడియా తలచుకుంటే ఒక్కరోజులో రోడ్డు మీది వ్యక్తిని ప్రపంచంలో పాపులర్ చేయగలదంటూ మీమ్స్ వేశారు. ఇలా ఆ పేరు వైరల్ అయిపోయింది. ఎంతలా వైరల్ అయిందంటే.. ఒకే రోజులో బినోద్ పేరుతో 4235 యూట్యూబ్ చానళ్లు క్రియేట్ అయ్యాయి. ఇంకా చాలా మంది తమ సోషల్ మీడియా డిస్‌ప్లే పేర్లను బినోద్ అని మార్చుకున్నారు. కొంతమంది తెలుగు మీమ్ మేకర్స్ కారణంగా ఈ పేరు తెలుగు సోషల్ మీడియా పేజీలకు కూడా పాకింది. కానీ హిందీ యూట్యూబ్ చానళ్లు ఫాలో అవని చాలా మందికి ఈ ట్రెండ్ వెనక కథ తెలియక తికమకపడుతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా.. వెళ్లి బినోద్ సంగతేంటో చూడండి!