కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే.. ‘దిశ’తో పని మొదలుపెట్టారు

by Shyam |   ( Updated:2021-09-11 06:15:37.0  )
కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే.. ‘దిశ’తో పని మొదలుపెట్టారు
X

దిశ, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో ఎన్నికల ముందు హామీలిచ్చిన ఎమ్మెల్యే అనంతరం విస్మరించారంటూ.. గతనెల 29న ‘అక్కడ కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే పనిచేసేదెప్పుడు?’ అంటూ దిశ ప్రశ్నించిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో సంబంధిత సర్పంచ్ రాజారాం రోడ్డు మరమ్మతుల పనులను శనివారం మొదలెట్టారు. రోడ్లు వాన పడితే చాలు బురదమయంగా మారి అడుగు వేసే పరిస్థితి ఉండేది కాదు. స్థానికుల నుండి తీవ్ర విమర్శలు రావడం, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారంటూ అసలు విషయాన్ని దిశ బయటికి తేవడంతో దిద్దుబాటు చర్యలకు నేతలు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన దిశ రిపోర్టర్‌ని స్థానికులు అభినందించారు.

అక్కడ కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే పని చేసేదెప్పుడు..?

Advertisement

Next Story