హుజురాబాద్‌లో బిగ్ సర్‌ప్రైజ్.. ‘ఈ’టల ఓటమికి కారణమవుతుందా.?

by Anukaran |
హుజురాబాద్‌లో బిగ్ సర్‌ప్రైజ్.. ‘ఈ’టల ఓటమికి కారణమవుతుందా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజకీయాలు, రాష్ట్ర పాలిటిక్స్ అంతా ఇప్పుడు హుజురాబాద్ వైపే చూస్తున్నాయి. హుజురాబాద్‌లో గెలిచేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ ముందు నుంచే హోరాహోరీ ప్రచారాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే, శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. ఈ ఉప ఎన్నికలకు గుర్తింపు పొందిన పార్టీల నుంచి 13 మంది, 43 మంది స్వతంత్రులతోపాటు మొత్తంగా 61 మంది నామినేషన్లు వేశారు.

ఇక నామినేషన్ల ఉప సంహరణ, పోలింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ ఉప ఎన్నికలో పోటీపడుతున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. హుజురాబాద్‌లో ఆయన కాకుండా రాజేందర్ పేరుతో మరో ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీపడుతున్నారు. వారి ఇంటిపేర్లు కూడా ‘ఈ’ అక్షరంతోనే ప్రారంభం కావడం ఈటలకు తలనొప్పిగా మారింది.

దీంతో ఆయనకు దక్కాల్సిన ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళన ఇప్పుడు బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్ పోటీలో ఉన్నారు. వీరంతా శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Next Story