- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
23 మంది సభ్యులతో నూతన ప్రెస్ క్లబ్
దిశ, మణుగూరు: పినపాక మండలంలో నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికను 23 మంది సభ్యులతో కూడిన ప్రెస్ క్లబ్ ను పత్రిక విలేకరులు ఎన్నుకున్నారు. ఆదివారం కరకగూడెం మండలంలోని రాళ్ళవాగు ప్రాంతంలో
ప్రెస్ క్లబ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలను ఓటింగ్ పద్దతి ద్వారా పత్రిక విలేకరులు ఎన్నుకున్నారు. ఈఎ న్నికలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నిమ్మ లింగారెడ్డి (ప్రజాసాక్షి ), ఉపాధ్యక్షులుగా బోడ లక్ష్మణ్ రావు(నినాదం), ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి సంతోష్ లు ఎన్నికయ్యారు. అనంతరం ప్రెస్ క్లబ్ కు గౌరవ న్యాయసలహాదారుడు(న్యాయవాది)గా కర్నెరవిని నియమించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ… ప్రతి పత్రికవిలేకరికి కష్టసుఖాలలో అండగా నిలుస్తామన్నారు.
మండలంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామన్నారు. పత్రిక విలేకరులకు ఇండ్ల స్థలాలు,నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయ నిర్మాణం కొరకు త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసి ఆ దిశగా పని చేస్తామన్నారు. అనంతరం న్యాయసలహాదారుడు కర్నెరవి నూతన ప్రెస్ క్లబ్ ను ఉద్దేశించి సభ్యులకు న్యాయసలహాలు, పలు సూచనలు ఇచ్చారు. ప్రతి పత్రికవిలేకరికి ప్రెస్ క్లబ్ అండగా ఉండాలని,సమాజంలో జరిగే అవినీతిని నిర్బయంగా వ్రాసి పత్రికల్లో ప్రచురించి ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులను ఆయన అభినందించారు.