మద్యం దుకాణాలకు మరో నోటిఫికేషన్..

by Shyam |
మద్యం దుకాణాలకు మరో నోటిఫికేషన్..
X

దిశ, జనగామ: జిల్లాలో వాయిదా పడిన మద్యం దుకాణాల దరఖాస్తులు ఈ నెల 28 వరకు స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వాయిదా పడిన మద్యం దుకాణాలు గెజిట్ షాప్ నెంబరు JAN 006, JAN 011, జనగామ మండలం పెంబర్తి లో ఒక్కటి, జనగామ మున్సిపల్ పరిధిలో ఒక్కటి ఉన్నాయి.

ప్రభుత్వ నిబధనల ప్రకారం ఈ నెల 25 నుండి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 29 వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ దరఖాస్తులు నర్మెట్ట రోడ్ నందు గల జిల్లా ఎక్సైజ్ కార్యాలయం, దేవాదుల ఇరిగేషన్ క్వార్టర్స్, క్వార్టర్ నెం. 5 లో సమర్పించాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed