- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానవ కణాల్లోకి వెళ్లకుండా కరోనాను అడ్డుకునే మందు?
దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 వైరస్ మానవ కణాల్లోకి కరోనా వైరస్ చొచ్చుకుని వెళ్లకుండా అడ్డుకోగల మందుని ఎంఐటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీన్ని లోతుగా పరిశోధించడం ద్వారా కరోనాకు ట్రీట్‌మెంట్ అభివృద్ధి చేయవచ్చని వారు చెబుతున్నారు. పెప్టైడ్ నిర్మిత ప్రోటీనుతో తయారు చేసిన ఈ మందు మానవ కణాన్ని ప్రతిబింబిస్తుంది. దీంతో కరోనా వైరస్ అదే మానవ కణం అనుకుని దాని మీద దాడి చేస్తుంది.
ప్రోటీనులోకి వైరస్ చేరాక దాన్ని నాశనం చేయగల ప్రధాన సమ్మేళనాన్ని ప్రస్తుతం వారు అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు ప్రొఫెసర్ బ్రాడ్ పెంటెల్యూట్ తెలిపారు. ఇప్పటికే ఈ పెప్టైడ్ సమ్మేళనాన్ని మనుషుల మీద ప్రయోగం కోసం శాంపిళ్లను పంపినట్లు ఆయన చెప్పారు. మార్చి మొదటివారంలో చైనా పరిశోధకులు కరోనా వైరస్ ప్రోటీన్ నిర్మితమని క్రయోఎం స్ట్రక్చర్ ఆధారంగా చెప్పిన వీరు ఈ పరిశోధన మొదలుపెట్టారు. అయితే కరోనా లాంటి జబ్బులను కలిగించే వైరస్‌లు ఒకటి కంటే ఎక్కువ ప్రోటీన్ స్పైక్‌లను కలిగి ఉండటంతో ఏ ప్రోటీను వల్ల మానవకణం ఎక్కువ ప్రభావితమవుతోందో కనిపెట్టడం కొద్దిగా కష్టమే. అయినప్పటికీ తమ పరిశోధనలో ఆంజియోటెన్సిన్ అనే రెసెప్టార్ ఎక్కువగా ప్రభావితం అవుతోందని వారు కనిపెట్టినట్లు బ్రాడ్ వెల్లడించారు.
Tags: Corona, Covid, SARS, laboratory, MIT, genome, protein