కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. డిజైన్ అదుర్స్

by Harish |   ( Updated:2021-08-25 06:57:41.0  )
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. డిజైన్ అదుర్స్
X

దిశ వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్(ఈ) బైక్ గో తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రగ్డ్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది రెండు వేరియెంట్లలో లభిస్తుంది. మొదటి రగ్డ్ జీ1 ధర రూ.84,999గా ఉంటే, రగ్డ్ జీ1 ప్లస్ ధర రూ.1,04,999గా ఉంది. ఈ ఏడాది నవంబర్ 2021 మొదటి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై వివిధ రాష్ట్రాల సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3కెడబ్ల్యు మోటార్ ఉంది. ఇది దాని డ్యూయల్ 2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు.

సున్నా శాతం నుంచి ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 3.5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ. వెళ్లగలదు అని ఈబైక్ గో పేర్కొంది. సుమారు 30 లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో 12 బిల్ట్ ఇన్ స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ బైక్ లాక్, అన్ లాక్ చేయవచ్చు. దీనిలో యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. దీనిలో కృత్రిమ మేథస్సు ఆధారిత ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ఈ స్కూటర్ ఛాసిస్ 7 సంవత్సరాల వారెంటీతో వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed