- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ చూపిన సమైక్యవాదంలో నడవాలి : ప్రొఫెసర్ నరేంద్రకుమార్
దిశ ప్రతినిధి, వరంగల్: భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన సమైక్యవాదం ఎంతో గొప్పదని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరేంద్రకుమార్ ఉద్బోధించారు. హన్మకొండ సెంటర్ రోడ్డులోని మాజీమంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు ఇంటినుంచి తెలంగాణ జన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన జూమ్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొవిడ్ సంక్షోభ సమయంలో డాక్టర్ అంబేద్కర్ సూచించిన సమైక్యవాదం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలపై ఆయన కీలకోపాన్యాసం చేశారు. కోవిడ్ నియంత్రణలో కలసి సంయుక్తంగా సాగాల్సిన కేంద్ర, రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తడం మంచి పరిణామం కాదని అన్నారు. సమైక్యవాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసి ముందుకు సాగాలని సూచించారు. ఈ సదస్సు తెలంగాణ జనవేదిక కన్వీనర్ తక్కెళ్లపల్లి రాము అధ్యక్షతన జరిగింది.