- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషంట్ల పర్యవేక్షణకు కొత్త యాప్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పేషంట్ల పర్యవేక్షణకు డీఆర్‌డీవో, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) కీలక నిర్ణయం తీసుకున్నాయి. రోగుల విషయంలో ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ రూపొందించి వారి కదలికలను పర్యవేక్షించనున్నాయి. స్మార్ట్ ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పేషెంట్స్, రిస్క్స్ (సంపర్క్) పేరుతో డీఆర్‌డీవో రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అమలుకు డీఆర్‌డీవోకు చెందిన సెంటర్ ఫర్ ఏఐ రోబోటిక్స్ సైంటిస్ట్ డాక్టర్ రితురాజ్ కుమార్, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల ఈ ఒప్పంద పత్రాలను ఆన్‌లైన్‌లో సోమవారం మార్చుకున్నారు. త్వరలో రాష్ట్రంలోని ఏదైనా ఓ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు రూపంలో అమలు చేయనున్నాయి.
ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్నవారు యథేచ్చగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. దీంతో వారి పర్యవేక్షణ పోలీసులకు భారంగా మారడంతో సమస్య పరిష్కారానికి డీఆర్‌డీఓ సంపర్క్‌ను రూపొందించింది. వారు ఉద్దేశపూర్వకంగా, అనుకోకుండా చేసే కదలికలను గుర్తించి హెచ్చరికలు పొందేందుకు సహాయ పడుతుంది. కదలికల గుర్తింపు జియోఫెన్సింగ్, ఫేస్ రికగ్నిషన్, మ్యాప్‌లో ఉన్న డేటా ఆధారంగా పోలీస్, వైద్యారోగ్య విభాగాలు క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉన్నవారి కదలికలను గుర్తించవచ్చు. ఈ కృత్రిమ మేథస్సు ఆధారిత ఇంటర్ఫేస్ నిర్వహణలో భాగంగా రోగి పేరు, సెల్‌ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరు, క్వారంటైన్ లొకేషన్, క్వారంటైన్ కాలపరిమితి, ఈమెయిల్ ఐడీ, ఫోటో వంటివి సమర్పిస్తే సరిపోతుంది. ఈ యాప్‌ను పేషెంట్ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పది నిమిషాలకోసారి కొవిడ్ సర్వర్‌కు అలెర్ట్ అందజేస్తుంది. రోగి యొక్క జియోఫెన్సింగ్ ప్రాంగణాన్ని వరుసగా నాలుగుసార్లు ఉల్లంఘించినట్లైతే స్మార్ట్‌ఫోన్ ద్వారా హెచ్చరిక సందేశం పంపిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన సెల్ఫీకి, అనంతరం ఇచ్చిన సెల్ఫీకి మధ్య పొంతన లేకపోయినా ఈ యాప్ అలెర్ట్ ఇస్తుంది. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల మాట్లాడుతూ డీఆర్‌డీఓ రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు టీటాను భాగస్వామ్య సంస్థగా ఎంచుకోవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని వెల్లడించారు.