ప్రచారం కోసం ప్రాణం లేని బొమ్మలు

by vinod kumar |
ప్రచారం కోసం ప్రాణం లేని బొమ్మలు
X

దిశ, వెబ్‌డెస్క్ : రోబో, రోబో 2.0 సినిమాలు చూస్తే.. అందులో సేమ్ రజనీ కాంత్‌, ఎమీ జాక్సన్‌లను పోలిన రోబోలు ఉంటాయి. కానీ వాటికి ప్రాణం ఉండదు. జస్ట్ కంప్యూటర్ ప్రొగ్రామింగ్‌తో మాత్రమే వర్క్ చేస్తాయి. అలానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చింది. దీంతో టెక్నాలజీ మరింతగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే జపాన్‌లో ‘ఏఐ జనరేటెడ్ మోడల్స్’ తెరపైకి వచ్చారు. కాగా ఓ ఏజెన్సీ కమర్షియల్ పర్పస్ కోసం వీటిని వినియోగిస్తోంది.

జపాన్‌లో డ్రగ్స్ రాకెట్‌లో పట్టబడ్డ మోడల్స్‌లో చాలామందికి ‘ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్స్’ ఉన్నట్లు తేలింది. ఇదంతా తమ వ్యక్తిగతం కావచ్చు. కానీ వారిని నియమించుకునే అడ్వర్‌టైజ్‌మెంట్ ఏజెన్సీకి ఇది చాలా ప్రమాదం. ఈ కారణంగా తాము ప్రమోట్ చేసే బ్రాండ్ సేల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ప్రముఖ మోడల్స్‌ను తమ కంపెనీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు వాడుకోవడం పెద్ద ప్రయాసగా మారింది. ప్రతి మనిషిలో లోపాలుండటం సహజం. అయితే ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుతూ కూర్చోలేరు కదా. అందుకే జపాన్ ఇన్నోవేటర్స్ టెక్నాలజీని నమ్ముకున్నారు. ‘మేం మోడల్స్‌ను తయారు చేస్తాం. ప్యూరర్ దెన్ బిఫోర్’ అంటూ వర్చువల్ మోడల్స్‌ను అభివ‌ృద్ధి చేశారు.

ఐఎన్ఏఐ మోడల్..

‘ఇమేజ్ నవీ’ అనే సంస్థ మొదట తమకు కావాల్సిన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత వారికి ఫొటో షూట్ చేసి, ఆ ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో మరింత మెరుగ్గా డెవలప్ చేస్తుంది. ఇక వారిని చూస్తే.. రియల్‌ మోడల్‌ను చూస్తున్నట్లే ఉంటుంది. కాగా ఈ సంస్థలో ఇటువంటి ‘అన్‌రియల్ మోడల్స్‌’కు సంబంధించిన ఫొటో లైబ్రరీయే ఉంటుంది. రిజల్యూషన్‌ను బట్టి ఒక్కో మోడల్ ఫొటో ధర 20 వేల నుంచి 33 వేల యెన్ వరకు పలుకుతుంది. ఐఎన్ఏఐ మోడల్‌(ఇమేజ్ నవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్) అనే సంస్థ వీటిని ఆఫర్ చేస్తోంది.

2020..

ప్రస్తుతానికైతే.. 20 ఏజ్ గ్రూప్ ఉన్న మహిళలనే ఫొటోషూట్‌కు తీసుకుంటుండగా.. భవిష్యత్తులో వివిధ ఏజ్ గ్రూప్స్‌కు చెందిన మహిళలను కూడా ఫొటోషూట్‌కు తీసుకుంటామని సంస్థ తెలిపింది. ఇకపై సెలబ్రిటీల అవసరం ఉండబోదని, స్కాండల్స్ గోల ఉండదని సంస్థ చెబుతోంది.

Advertisement

Next Story

Most Viewed