నేను ఆడతానని జీవితంలో అనుకోలేదు : మంధాన

by Shyam |   ( Updated:2021-05-26 12:03:30.0  )
నేను ఆడతానని జీవితంలో అనుకోలేదు : మంధాన
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. భారత జట్టు త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నది. ఆ పర్యటనలో తొలి సారిగా డే/నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్) ఆడనున్నది. ఈ విషయం తెలిసిన తర్వాత మంధాన ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ‘నిజం చెప్పాలంటే పురుషుల పింక్ బాల్ టెస్టులు చూస్తూ ఉండేదానిని.. ఇలాంటి మ్యాచ్ నేను ఎప్పుడైనా ఆడగలనా అని అనుకునే దానిని.. కానీ ఇంత త్వరగా అలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. డే/నైట్ టెస్ట్ ఆడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది’ అని మంధాన క్రిక్ఇన్ఫో వెబ్‌సైట్‌తో చెప్పింది. భారత మహిళా జట్టు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆ పర్యటనలో ఆడనున్నది. అనంతరం సెప్టెంబర్ నెలలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నది. అందులో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్‌లోని వాకా స్టేడియంలో పింక్ బాల్ టెస్ట్ ఆడనున్నది.

Advertisement

Next Story

Most Viewed