మెగాస్టార్ కాదు.. దగా స్టార్! చిరుపై నెటిజన్ల ఫైర్

by Jakkula Samataha |
మెగాస్టార్ కాదు.. దగా స్టార్! చిరుపై నెటిజన్ల ఫైర్
X

దిశ, సినిమా: ‘ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడుకుందాం’ అన్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ విమర్శలు ఎదుర్కొంటోంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, అందువల్ల నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదని, ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించు కావాలని కోరారు. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అని దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా చెవులో మారుమోగుతూనే ఉన్నాయన్నారు. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదువుతున్నప్పుడు బ్రష్ చేతపట్టుకుని గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాస్తూ ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు చేశామని తెలిపారు.

అయితే ఇప్పుడు ఇదే ట్వీట్ చిరుకు నెగెటివ్ కామెంట్స్ తెచ్చిపెట్టింది. చిరు మెగాస్టార్ కాదు, దగా స్టార్ అని తిట్టిపోసేలా చేస్తోంది. విశాఖ ఉక్కు ఉద్యమం జరిగింది 1966-67లో అని.. అప్పుడు చిరుకు 11 ఏళ్ల వయసు ఉంటుందని, ఆ సమయంలో కాలేజీకి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో 1973-76 వరకు చదివారని, అలాంటప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ధర్నాలు ఎలా చేయగలరు? అని అడుగుతున్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం చేయాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ట్రోల్ చేస్తున్నారు. చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా.. ఈ కథలు మా దగ్గర వద్దు అని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed