- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్య సింప్లిసిటీకి ఫిదా..
దిశ, వెబ్‌డెస్క్: సూర్య.. రీల్ లైఫ్ హీరోగా ఎంత గొప్ప ప్రశంసలు అందుకుంటాడో, రియల్ లైఫ్‌లో తను చేసే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా అంతే గొప్పగా ఆదరించబడతాడు. ముఖ్యంగా తన సింప్లిసీటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఏ కార్యక్రమానికి అటెండ్ అయినా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. కాగా సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ద్వారా అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
తాజాగా దర్శకురాలు సుధ కొంగర కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరగ్గా.. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన సూర్య చాలా సింపుల్‌గా బిహేవ్ చేశారు. వీఐపీగా నూతన వధూవరులను ఆశీర్వదించి, తను వచ్చిన పని అయిపోయిందని కూర్చోకుండా.. పెళ్లి కూతురుకు పట్టే పందిరిని పట్టుకుని ఆత్మీయుడు అనిపించుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాశ్ కుమార్ కూడా అంతే సామాన్యుడిలా పందిరి పట్టుకుని వధువుని మండపానికి తీసుకువెళ్లారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సూర్య, జీవీ ప్రకాశ్‌లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.